Tuesday, 8 October 2024
ఇదే ఖర్మ
ఒక సారీ అష్ట దిక్పాలకులకు సమావేశం జరుగుతుంది ఆ సమయంలో ఒక చిలక అక్కడ ఉంటే యముడు దానీవంక విచిత్రంగా చుసాడు.అది గమనించిన చిలక అటుగా వచ్చిన గరుత్మంతునికి ఈ విషయం చెప్పి నా పని అయిపొయునట్లు ఉంది యముడు వింతగా చూసాడు అని విన్నవించిండి. ఆ మాటకి గరుత్మంతుడు నెనున్నా కదా ఏమి కనివ్వనని చెప్పి దానికి వాయు వేగ మనో వేగంతో చాలా దూరం తిసుకెళ్ళి ఒక గుహలో ఒక బిలంలో దాచిపెట్టి అంతే వేగంతో వెనక్కి వచ్చాడు. సమావేశం పూర్తయిన తర్వాత వచిన యముడితో ఇంతకు ముందు అక్కడున్న చిలుకని విచిత్రంగా చూసారంట కదా ఎందుకు అని ఆరా తీస్తే. యముదర్మరాజు ఇలా చెప్పసాగాడు. ఇక్కడ ఉన్న ఈ చిలక ఎక్కడో లక్షల మైళ్ళ దూరంలో ఉన్న పిల్లికి ఎలా ఆహరం అవుతుందా అని సందేహం వచ్చింది, ఈపాటికే ఆహారం అయిపొయి ఉంటుంది అని అన్నడట. ఖర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు
~వెన్నరవి
టపా సమయం 16:57
Subscribe to:
Posts (Atom)