prev next

Sunday 20 September 2020

దేవుడు ఎక్కడున్నాడు

Posted on 11:56 by Vennaravi

                                       ఎక్కడో, ఎప్పుడో చదివిన చిన్న కధ నాకు బాగా నచ్చి అందరికీ షేర్ చేయదలచాను. కధని నా సొంత పదాలతో కొంచెం వ్యంగ్యంగా రాస్తున్నాను. 
                                          ఒకానొక సారి విష్టుమూర్తికి ఆల్ ఇండియా రేడియొకి దీటీఎస్ పెట్టిన లెవల్లో తల పగిలిపోయెలా గోల వినిపిస్తుదంట సరిగ్గా గమనించాక అవి మనుషులు వేడుకుంటున్నారు అని అర్దమైంది ఎంచేయాలో పాలు పోలేదు ఇప్పటికి ఇప్పుడు వాళ్ళ కష్టాలు నేను తీర్చలేను ఎంచేయాలా అని ఆలోచిస్తుంటే అంతలో సీరియల్‌లో నారాయణ లాగా నారదుడు వచ్చాడు. పట్టరాని ఆనందంతో వచ్చావా మనవడా నా సమస్యాకి పరిష్ఖారం సూచించమని ఎకరవు పెట్టాడు, నారదుడు బాగా సోచాయించి తాత..... వెళ్ళి గుహలో కూర్చో అక్కడ గాలి కూడా చొరబడదు శబ్దాలు కూడా వినపడవు అని సలహా ఇచ్చాడు. ఒక్క దూకుతో టేలీపోర్టర్ సాయంతో వెళ్ళి గుహలో కూర్చున్నాడు. 
                                          
                                          ప్రయొజనం లేకుండా పొయింది ఇంకా డీటిఎస్ లో  వినపడుతున్నాయి జనాల ఆర్తనాదాలు. ఒల్లుమండుకొచ్చి నారదుణ్ణి రమ్మన్ని కబురుపెట్టాడు, నారదుడు వస్తూనే కొత్త ఆలోచన చెప్పాడు 'వేరే గ్రహం అయితే ఏ గోల ఉండదు అక్కడ విశ్రాంతి తీసుకొమ్మన్నాడు. సరేనని వెళ్ళి కూర్చున్నాడు అయినా రిజల్ట్ ఫెయుల్ అనే వచ్చింది. ఎట్లా అయినా ఈ సమస్యని ఈ సీజన్ లోనే పరిష్కరించాలి అని ఫిక్స్ అయి మళ్ళి నారదుణ్ణి రప్పించాడు, ఈ సారి మాత్రం తేడా రాకూడదు మంచి సలహ ఇవ్వమన్నాడు. నారదుడు 'మహతీతో కాసేపు ప్రాక్టీస్ చేసి మైండ్ కూల్ అయ్యాక మెరుపులాంటి ఆలోచనతో ముందుకొచ్చాడు తాత కాచుకో ఈసారి  దెబ్బకి ఠా దొంగలముటా అన్నట్లు ని సమస్య మటుమాయం అయిపోతుంది చూసుకో అని సవాలు చేసూ చెప్పాడు. నారదుడి ఈ సలహా బాగా పనిచేసింది ఆరోజు నుండి విష్ణువుకు సుఖంగా నిద్ర పడుతుందట. ఇంతకీ నారదుడు సూచించిన చోటు మనిషి మనసులో ఉండమని.
                                          నేను పైన చెప్పిన కధ శైలి ఎలా ఉన్నా ఇందులో ని నీతి మాత్రం మనిషి మనసుని జయించలేడు, జయించిన వాడికి దేవుడితో పని లేదు అని.
                                          ఇది నీతిని నేను నమ్మడం వలన అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను
                                            ----------------------వెన్నరవి--------------------------