Sunday, 20 September 2020
దేవుడు ఎక్కడున్నాడు
Sunday, 31 March 2013
అంతా మిధ్య
వెనకటికి వేధాంతం తెలిసిన ఒక గురువుగారు శిష్యులతో ఇలా చేప్త్తున్నాడు. నాయనలారా ఏదీ నిజంకాదు, నిజం అని మనం అనుకుంటాం అంతే అంతా మిధ్య అని. ఇది నచ్చని ఒక శిష్యుడు ఎలాగైనా గురువుగారిని ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక రోజు అవకాశం రానే వచ్చింది ఆ శిష్యుడు, గురువుగారు కలిసి వీధిలో నడుస్తున్నారు అంతలో రాజుగారి ఏనుగు మదంతో వీధి వెంబడి పరుగులు తీస్తూ దుకాణాలను ద్వంసం చేస్తుంది . దానిని చూసి అందరూ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. మన గురుశిష్యులు కూడా కాళ్ళకు బుద్ది చేప్పారు. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసే ఏనుగు కనిపించలేదు హమ్మయ్య ప్రాణలు దక్కాయనుకుని నెమ్మదిగా నడవసాగారు. ఇంతలో శిష్యుడు గురువుగారితో ఏదీ నిజం కాదు అంతా మిధ్య అనారు కదా మరి ఏనుగు మిధ్యే అనుకుని అక్కడే ఉండవచ్చు కదా అని అడీగాడు. గురువుగారు ఆలోచించకుండానే ఓరి పిచ్చివాడా గజం మిధ్య, పలాయనం మిధేరా అన్నాడట (ఏనుగు మిధ్యే, పారిపోవడం కూడా మిధ్యే). అది విన్న శిష్యుడికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది
దీని నుండి నాకు అర్దమైంది ఎంటంటే ఒక విషయాన్ని మనం ఎలా చూస్తే అలాగే కనబడుతుంది అని "యత్ భావం తత్ భవతిః". ఒకే విషయాన్ని కొంతమంది +ve గా చూడచ్చు, కొంతమంది -ve గా చూడచ్చు మన ఆలోచనా విదానాన్ని బట్టే అవి కనిపిసూ ఉంటాయి.
ఇంకో విషయం ఏమిటంటే నీకు నిజమని తెలిసినా భ్రమలో బ్రతకమని చెప్పినట్లు ఉంది గురువుగారి మాటలు చూస్తే. ఈ సంఘటనలో ఏనుగు నిజం దన్ని చూసి పరిగెట్టడం నిజం. కానీ తప్పించుకోవడనికి ఆయన చెప్పిన మాటలు మాత్రం Maths లో చెప్పే Proportionality ప్రిన్సిపుల్ లాగా ఉంది. ఏనుగు ఉండటం బ్రమ అనుకుంటే పారిపోవడం కూడా నీ బ్రమ అని చెప్పడం.
----వెన్నరవి----
Tuesday, 19 June 2012
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు

ఈమద్య నాకు కొత్త సందేహాలు మొదలయ్యాయి అసలు మన సామెతలు కరెక్టేనా అని ఇంటగెలిచి రచ్చగెలవమని ఒక సామెత ఉంది అంటే మనం ఉన్న చోట ఎదైనా సాదిస్తే ఆతరవాత వేరే ప్రదేశంలో కూడ సత్తా చూపవచ్చు అని దాని అర్దం అనుకున్నను, కానీ ఇంట గెలవకుండా బయట గెలిచిన వారు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్తితి ఎంటి అని. సామెత నిజమైతే "అల్బర్ట్ ఐన్స్టిన్" లాటి వాళ్ళు సొంత దేశం వదిలి వేరే దేశాలలో విజయాలు సాదీంచలేదా అని. అంటే సామేత సరైందే అయి ఉంటుంది కానీ మనం అర్దం చేసుకోవడం తప్పు అని. నాకు అర్దమైంది ఎంటంటే రచ్చ గెలవడం సులబం కానీ ఇంట్లో గెలవడం కష్టం అని. మన వాళ్ళే మనల్ని నమ్మరు బయటి వాళ్ళు మాత్రం నమ్మే అవకాశాలు ఎక్కువ. మన దేశంలో జరుగుతున్నది కూడా ఇదే. ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళి అద్బుతాలు చేసి చూపిస్తున్నారు. మనదేశంలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి కొరత లేదు కానీ మనవాళ్ళు మనకి అక్కరలేదు.
Monday, 26 March 2012
10 Lessons from Einstein
1. Follow Your Curiosity “I have no special talent. I am only passionately curious.”
2. Perseverance is Priceless “It’s not that I’m so smart; it’s just that I stay with problems longer.”
3. Focus on the Present “Any man who can drive safely while kissing a pretty girl is simply not giving the kiss the attention it deserves.”
4. The Imagination is Powerful “Imagination is everything. It is the preview of life’s coming attractions. Imagination is more important than knowledge.”
5. Make Mistakes “A person who never made a mistake never tried anything new.”
6. Live in the Moment “I never think of the future – it comes soon enough.”
7. Create Value “Strive not to be a success, but rather to be of value.”
8. Don’t be repetitive “Insanity: doing the same thing over and over again and expecting different results.”
9. Knowledge Comes From Experience “Information is not knowledge. The only source of knowledge is experience.”
10. Learn the Rules and Then Play Better “You have to learn the rules of the game. And then you have to play better than anyone else.”