prev next
Showing posts with label మనసులో. Show all posts
Showing posts with label మనసులో. Show all posts

Thursday, 24 December 2015

స్వచ్చ భారతం అంట!

కేంద్ర ప్రభుత్వం స్వచ్చభారత్ సెస్ అని 0.5% సర్వీస్ ట్యాక్స్ తో కలిపి వసూలుచేస్తుంది. మరి ఆ డబ్బులు ఎంచేస్తున్నారో ఎవరికీ తెలీదు. వీది చివర చెత్తకుండి పెట్టే దిక్కు ఉండదు, చెత్త ఎక్కడ పోస్తారు మరి ప్రజలు అన్ని రకాల ట్యాక్స్ లు కట్టించుకుని కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం స్వచ్చభారత్ అని జనాలకి శుబ్రత నేర్పుతుంది. ఎవడి వీది వాడు ఊడ్చుకోవడానికి ఎవడి ఇల్లు వాడూ శుబ్రంగా ఉంచుకోవడానికి ప్రభుత్వానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి. టివీల్లో ఆర్బాటం చేయడానికా, లేక ఇప్పటిదాకా లేని సౌకర్యాలు కల్పించడానికా.
                             ~ వెన్నరవి

Thursday, 8 October 2015

అనుకున్నది

మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలచాడని. మనం ఏది అనుకుంటే అది చచ్చినా జరగదు

Friday, 22 February 2013

భారత దేశ పౌరులకి జీవించే హక్కులేదు!

అవును దేశంలో రాజకీయనాయకులకు, సంఘ విద్రోహులకు మాత్రమే ఆ సౌలబ్యం ఉంది. వాళ్ళ ప్రాణాలకే విలువ తప్ప మనలాంటి వాళ్ళు ఎలాపోయినా పర్లేదు ప్రభుత్వాలకి. ఎవరు ఎవరినైనా బాంబులు పెట్టి చంపచ్చు, కనిపించిన ఆడవాళ్ళని రేప్‍ చేయవచ్చు. ఎదైనా అయి ఎవరైనా పోతే మాత్రం నష్టపరిహారం చెల్లిస్తారు, టీవీల్లో ఖండిస్తారు. హైదరాబాదులో బాంబులు పేల్చినా, ముంబయిలో తుపాకులతో దాడుల చేసినా బుద్దిరాదు మన వాళ్ళకి. ఇంతకన్నా విమర్సించడానికి కూడా అసహ్యంగా ఉంది మన రాజకీయ వ్యవస్తని.

Monday, 11 April 2011

కాలం మారింది

ఒకప్పుడు అబ్బాయిలు విచ్చలవిడిడా తిరుగుతున్నారని ప్రతిఒక్కరూ నిందించేవాళ్ళు కాని ఇది చదివితే మాత్రం అమ్మయిల తల్లిదండ్రులకు  మాత్రం పెద్ద షాక్ తగలక మానదు. ఎందుకంటే అమ్మయిలు అణుకువగా ఉంటారని అందరూ బావిస్తూ ఉంటారు, కొంతమంది సిటి అమ్మాయిలు చెడిపోయారని లెక్చర్ లు దంచెస్తుంటారు. కానీ హైదరాబాదులో పరిస్తితి వేరే విధంగా ఉంది. స్దానికంగా ఉండే వాళ్ళు చక్కగానే ఉంటున్నారు కానీ సినిమాలు చూసి ఎర్ర బస్సెక్కి వచ్చెవాళ్ళు హాస్టల్ లోనో బంధువుల ఇంట్లోనొ ఉంటూ చదువుకుంటూ ఉంటారు. సిటిలోకి అడుగుపెట్టె అమ్మయిలలో 95 శాతం బాయ్ ఫ్రెండ్ ని మెయింటెన్ చెస్తున్నారు. ఈ విషయం అర్దం చెసుకోవాలంటే ఆమీర్ పేటలోని ఎ ఉమన్స్ హాస్టల్ ముందు సాయంత్రం 6 తర్వాత ఒక రౌండ్ వేస్తె ఒక క్లారిటీ వస్తుంది. ఈ పరిణామాలకు మూలకారణంగా చెప్పుకునేది సిటీ కల్చర్ సిటీ అమ్మయిలలో అంతగా కనబడడం లేదు. సినిమాలు చూసి ఉహాల్లో ఉండి ఇక్కడ దిగేవాళ్ళు అలా తయారవుతున్నారు. ప్రతి శనివారం ఈనాడు ఈతరం పేజి చూస్తే అమ్మయిలు ఎంత ఈజిగా బాయ్ ఫెండ్స్ ని మారుస్తున్నా రో అర్దంచేసుకోవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చెస్తున్నారనేది పాత తరం కధ. ఇప్పుడంతా  కొత్త ట్రెండ్ అంతా బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకోవడం. మరి ఇవన్ని తెలియని మనోహర్ లాంటివారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నరు శ్రీ లక్ష్మి లాంటి వాళ్ళ ప్రాణాలు బలిగొంటున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లు. వేచి ఉంటే సెకెడ్ హ్యాండ్ గర్ల్ ప్రెండ్స్ ఎంతమంది ఉంటారో. ఇంకొ రకం అమ్మయిలు ఉంటారు వాళ్ళు పాపం బ్లాక్ మెయిలింగ్ బాగా విస్వసిసున్నారు. పెళ్ళిచేసుకోకపోతే అదిచేస్తా ఇది చేస్తా అని తెగ బెదిరిస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం మాప్రెండ్ ని ఒక అమ్మాయి తగులుకుని పాపం వాడిని నానా హింసలు పెట్టింది. వాణ్ణి బయటికి తేవడాని ఎన్న కష్టాలు పడ్డామొ మాకే తెలుసు. వెనకటికి ఒక సామెత ఉండేది "ఆకొచ్చి ముల్లు మీద పడ్డా ముల్లోచ్చి అకు మిద పడ్డా నష్టపోయెది ఆకు అని" కాని అటువంటి ప్రమాదాన్ని నివరిచడానికి ’కండోమ్స్’ వస్తాయని రాసినవారు అప్పట్లో ఊహించి ఉండరు కాబోలు. ఇవన్ని నేను స్వయంగా చూసిన మీదట మాత్రమే రాస్తున్నాను ప్రత్యేకించి ఎవరిని ఉద్దేసించినవి కాదు.