Thursday, 24 December 2015
స్వచ్చ భారతం అంట!
Posted on 09:42 by Vennaravi
కేంద్ర ప్రభుత్వం స్వచ్చభారత్ సెస్ అని 0.5% సర్వీస్ ట్యాక్స్ తో కలిపి వసూలుచేస్తుంది. మరి ఆ డబ్బులు ఎంచేస్తున్నారో ఎవరికీ తెలీదు. వీది చివర చెత్తకుండి పెట్టే దిక్కు ఉండదు, చెత్త ఎక్కడ పోస్తారు మరి ప్రజలు అన్ని రకాల ట్యాక్స్ లు కట్టించుకుని కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం స్వచ్చభారత్ అని జనాలకి శుబ్రత నేర్పుతుంది. ఎవడి వీది వాడు ఊడ్చుకోవడానికి ఎవడి ఇల్లు వాడూ శుబ్రంగా ఉంచుకోవడానికి ప్రభుత్వానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి. టివీల్లో ఆర్బాటం చేయడానికా, లేక ఇప్పటిదాకా లేని సౌకర్యాలు కల్పించడానికా.
~ వెన్నరవి