prev next

Tuesday, 19 June 2012

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు

Posted on 18:45 by Vennaravi

ఈమద్య నాకు కొత్త సందేహాలు మొదలయ్యాయి అసలు మన సామెతలు కరెక్టేనా అని ఇంటగెలిచి రచ్చగెలవమని ఒక సామెత ఉంది అంటే మనం ఉన్న చోట ఎదైనా సాదిస్తే ఆతరవాత వేరే ప్రదేశంలో కూడ సత్తా చూపవచ్చు అని దాని అర్దం అనుకున్నను, కానీ ఇంట గెలవకుండా బయట గెలిచిన వారు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్తితి ఎంటి అని. సామెత నిజమైతే "అల్బర్ట్ ఐన్‌స్టిన్" లాటి వాళ్ళు సొంత దేశం వదిలి వేరే దేశాలలో విజయాలు సాదీంచలేదా అని. అంటే సామేత సరైందే అయి ఉంటుంది కానీ మనం అర్దం చేసుకోవడం తప్పు అని. నాకు అర్దమైంది ఎంటంటే రచ్చ గెలవడం సులబం కానీ ఇంట్లో గెలవడం కష్టం అని. మన వాళ్ళే మనల్ని నమ్మరు బయటి వాళ్ళు మాత్రం నమ్మే అవకాశాలు ఎక్కువ. మన దేశంలో జరుగుతున్నది కూడా ఇదే. ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్ళి అద్బుతాలు చేసి చూపిస్తున్నారు. మనదేశంలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి కొరత లేదు కానీ మనవాళ్ళు మనకి అక్కరలేదు.