prev next

Sunday, 31 March 2013

అంతా మిధ్య

Posted on 18:25 by Vennaravi

వెనకటికి వేధాంతం తెలిసిన ఒక గురువుగారు శిష్యులతో ఇలా చేప్త్తున్నాడు. నాయనలారా ఏదీ నిజంకాదు, నిజం అని మనం అనుకుంటాం అంతే అంతా మిధ్య అని. ఇది నచ్చని ఒక శిష్యుడు ఎలాగైనా గురువుగారిని ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక రోజు అవకాశం రానే వచ్చింది ఆ శిష్యుడు, గురువుగారు కలిసి వీధిలో నడుస్తున్నారు అంతలో రాజుగారి ఏనుగు మదంతో వీధి వెంబడి పరుగులు తీస్తూ దుకాణాలను ద్వంసం చేస్తుంది . దానిని చూసి అందరూ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. మన గురుశిష్యులు కూడా కాళ్ళకు బుద్ది చేప్పారు. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసే ఏనుగు కనిపించలేదు హమ్మయ్య ప్రాణలు దక్కాయనుకుని నెమ్మదిగా నడవసాగారు. ఇంతలో శిష్యుడు గురువుగారితో ఏదీ నిజం కాదు అంతా మిధ్య అనారు కదా మరి ఏనుగు మిధ్యే అనుకుని అక్కడే ఉండవచ్చు కదా అని అడీగాడు. గురువుగారు ఆలోచించకుండానే ఓరి పిచ్చివాడా గజం మిధ్య, పలాయనం మిధేరా అన్నాడట (ఏనుగు మిధ్యే, పారిపోవడం కూడా మిధ్యే). అది విన్న శిష్యుడికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది

 

దీని నుండి నాకు అర్దమైంది ఎంటంటే ఒక విషయాన్ని మనం ఎలా చూస్తే అలాగే కనబడుతుంది అని "యత్‍ భావం తత్‍ భవతిః". ఒకే విషయాన్ని కొంతమంది +ve గా చూడచ్చు, కొంతమంది -ve గా చూడచ్చు మన ఆలోచనా విదానాన్ని బట్టే అవి కనిపిసూ ఉంటాయి. 

ఇంకో విషయం ఏమిటంటే నీకు నిజమని తెలిసినా భ్రమలో బ్రతకమని చెప్పినట్లు ఉంది గురువుగారి మాటలు చూస్తే. ఈ సంఘటనలో ఏనుగు నిజం దన్ని చూసి పరిగెట్టడం నిజం. కానీ తప్పించుకోవడనికి ఆయన చెప్పిన మాటలు మాత్రం Maths లో చెప్పే Proportionality ప్రిన్సిపుల్ లాగా ఉంది. ఏనుగు ఉండటం బ్రమ అనుకుంటే పారిపోవడం కూడా నీ బ్రమ అని చెప్పడం.

 

----వెన్నరవి----